నాగపూర్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో.. తొలి రోజు భోజన విరామ
సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 76 రన్స్ చేసింది. లబుషేన్
47, స్మిత్ 19 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. నాగపూర్ వేదికగా జరుగుతున్న
మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే
ఆరంభంలో ఇండియా బౌలర్లు ఇరగదీశారు. సిరాజ్, షమీలు చెరో వికెట్
పడగొట్టారు. ఓపెనర్లు ఖవాజా, వార్నర్‌లు త్వరత్వరగా ఔటయ్యారు. ఇక
మూడవ వికెట్ కోసం లబుషేన్, స్మిత్‌లు నిలకడగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ
ఇప్పటి వరకు 74 రన్స్ జోడించారు. ఇక ఇండియా తరపున ఇవాళ ఇద్దరు
ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోన
భరత్ కూడా టెస్టు ఎంట్రీ ఇచ్చారు .మాజీ కోచ్ రవిశాస్త్రి.. టెస్టు
క్యాప్‌ను సూర్యకుమార్‌కు అందించాడు. పూజారా చేతుల మీదుగా భరత్ క్యాప్
అందుకున్నాడు. ఆ ఇద్దరి ఆటగాళ్ల కుటుంబసభ్యులు కూడా స్టేడియంకు వచ్చారు.