‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత కథానాయకుడు నాగార్జున మరో చిత్రమేదీ ప్రకటించలేదు.
మలయాళంలో విజయవంతమైన ‘పొరింజు మరియం జోస్’ రీమేక్ లో ఆయన నటించబోతున్నట్లు
వార్తలొచ్చినా…అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ లో మార్పు
వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా
మారనున్నట్లు గతంలో ప్రచారం వినిపించింది. కానీ, నాగ్ ఇప్పుడా అవకాశాన్ని
ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీకి అందించారని సమాచారం. ప్రస్తుతం
స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోందని..విజయ్ కి ప్రసన్న కుమార్ రచనా
సహకారం అందిస్తున్నారని తెలిసింది. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలు కానున్నట్లు
ప్రచారం వినిపిస్తోంది.