బ్రసెల్స్: ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్
స్టోల్టెన్బెర్గ్ పదవీ కాలాన్ని పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి.
ఆయన 2024 అక్టోబరు 1 వరకు ఆ పదవిలో ఉంటారు. నార్వే మాజీ ప్రధాని అయిన
స్టోల్టెన్ బెర్గ్ 2014 నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతేడాదే
పదవీకాలం ముగిసినా ఉక్రెయిన్ యుద్ధంలో దృఢ వైఖరిని అవలంబించినందుకు ఆయన పదవీ
కాలాన్ని పొడిగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిపై ఏకాభిప్రాయం కుదరనందున
స్టోల్టెన్ బెర్గ్నే మరికొంత కాలం కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఉక్రెయిన్ యుద్ధం ముగిసేవరకు కొత్త ప్రయోగాలు చేయకూడదని నాటో భావిస్తోంది.