శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
విరుపాపురంలో కొత్తగా నిర్మించిన ‘ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ’ మంత్రి
బుగ్గన చేతుల మీదుగా ప్రారంభం
రూ.8 కోట్లతో అత్యాధునిక సదుపాయలకు నిలయంగా ఆదోని పాలిటెక్నిక్ కళాశాల
ఆదోని పట్టణంలో ‘డివిజనల్ ఉప ఖజానా’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన
ఆదోని మున్సిపల్ స్కూల్ లో ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ
సదుపాయాలందించే బాధ్యత సర్కార్ ది..చదవడం మాత్రమే మీ పని
శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ కథను చెప్పి విద్యార్థులలో స్ఫూర్తి నింపిన
మంత్రి బుగ్గన
ఆదోనిలోని 133 స్కూళ్లలో 31,952 మంది విద్యార్థులకి ‘జగనన్న విద్యా కానుక’
కిట్ల పంపిణీ
నచ్చిన రంగంలో..స్వేచ్ఛగా రాణించాలని విద్యార్థులకు మంత్రి బుగ్గన పిలుపు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివృద్ధి
కార్యక్రమాలతో మమేకం
‘అభివృద్ధి’పై ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి
ఆదోని : కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు,
ప్రారంభోత్సవాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మమేకమయ్యారు.
విరుపాపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన ‘ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ’ని
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. రూ.8 కోట్లతో అత్యాధునిక
సదుపాయాలతో నిర్మించిన కళాశాల రాకతో యువతకు విద్యావకాశాలు మరింత మెరుగపడాలని
మంత్రి ఆకాంక్షించారు. 2009లో ‘వైఎస్ఆర్’ పాలనలో మంజూరుకు నోచుకుని..ఇప్పుడు
ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి చేసుకుని,
ప్రారంభించుకోవడం గొప్ప విషయంగా మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధిపై
ప్రతిపక్షనాయకులు, వారికి అనుకూలంగా వ్యవహరించే అనుకూల మీడియా ద్వారా
అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఆదోనికి పాలిటెక్నిక్
కాలేజీ, మెడికల్ కాలేజీలు రావడం అభివృద్ధి కాదా? అని ప్రతిపక్షాలను మంత్రి
బుగ్గన ప్రశ్నించారు.పాఠశాలలు, ప్రభుత్వ భవనాలను సరికొత్తగా నిర్మించడం,
వాటిలో వసతులు మెరుగుపరచడం అభివృద్ధిలో భాగం కాదా? అన్నారు. వాస్తవాలు
తెలిసిన ప్రతి ఒక్కరు, ప్రజలు స్వచ్ఛందంగా తిరిగి ప్రశ్నించాలని ,
ప్రతిపక్షాల దుష్ప్రచారాలను అడ్డుకోవాలన్నారు. ఏ రంగంలోనైనా ఎదిగేందుకు
ముఖ్యంగా మహిళలను ప్రోత్సహిస్తున్నది వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం
మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, మంచినీళ్లు లేని పాఠశాలలు సహా
మొత్తం 40 వేల స్కూళ్లు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం
గర్వకారణమన్నారు.జీఐఎస్ సమ్మిట్ సాక్షిగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు
రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో పెట్టడానికి వచ్చామని స్వయంగా ప్రకటించడం
ప్రతిపక్షం కళ్లుమూసుకున్నట్లు నడించినా ప్రజలు కళ్లారా చూస్తూ అంతా
గమనిస్తున్నారన్నారు.పరిశ్రమలకు కావలసిన నైపుణ్య వనరులుగా యువతను సన్నద్ధం
చేయడానికి ..డిజైన్ చేయడానికి ఇంజినీరింగ్, తయారీ రంగంలో పాలిటెక్నిక్,
మానవవనరులు ప్రధానంగా ఐటీఐలను ఆధునీకరిస్తున్నామన్నారు.
‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు, తల్లిదండ్రులకు వరం : ఆర్థిక శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్
ఆదోని పట్టణంలోని మున్సిపల్ స్కూల్ లో కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ
చేశారు.ఆదోనిలోని 133 స్కూళ్లలో 31,952 మంది విద్యార్థులకి ‘జగనన్న విద్యా
కానుక’ కిట్లను నాలుగో విడత అందజేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నోట్
పుస్తకాలు, బూట్లు, 3 జతల స్కూల్ యూనిఫాంలు,బ్యాగ్, బెల్ట్,ఆక్స్ ఫర్డ్
డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, 2 జతల సాక్స్,టెక్స్ట్ బుక్ లుు సహా మొత్తం 9
వస్తువులను జగనన్న కిట్లలో ఉంచి పంచుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా
మొత్తం 25 మండలాల్లోని 1493 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న మొత్తం 2,93,955
మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు
చిన్నతనంలో సహజంగా ఉండే సూక్ష్మమైన అంశాన్ని సైతం గుర్తించి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ‘జగనన్న విద్యా కానుక’కు శ్రీకారం చుట్టారని ఆర్థిక మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ వెల్లడించారు. మాకు లేదనే బాధ లేకుండా విద్యార్థులందరికీ సమానంగా
అన్ని సదుపాయాలు ఉండాలనేదే ‘జగనన్న విద్యాకానుక’ ఉద్దేశమన్నారు. ‘నాడు-నేడు’
ద్వారా రాష్ట్రంలో 40 వేల పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు.గత నాలుగేళ్ల క్రితం
వరకూ టాయిలెట్ల వసతి సహా మౌలిక సదుపాయాలు సమగ్రంగా లేని పరిస్థితిని మంత్రి
బుగ్గన ప్రస్తావించారు. మొట్టమొదటగా బల్బ్ ని కనిపెట్టి యావత్ ప్రపంచానికి
వెలుగులు పంచిన ‘శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్’ చిన్ననాటి కథను చెప్పి
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు.నచ్చిన
రంగంలో..స్వేచ్ఛగా రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కనీస వసతులు లేని
కాలంలోనూ కష్టపడి విజయం సాధించిన వారెందరో ఉన్నారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం
అందిస్తున్న అవకావాలను, సదుపాయాలను వినియోగించుకుంటూ చదవడం మాత్రమే
పెట్టుకోవాలన్నారు.
ఆదోని పట్టణంలో ‘డివిజనల్ ఉప ఖజానా’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన
ఆదోని పట్టణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ‘డివిజనల్ ఉప ఖజానా’
కార్యాలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభించారు. ఆర్థిక శాఖ నిధుల
ద్వారా మొదటి, రెండో ఫేజ్ లలో రూ.1.08 కోట్లు వెచ్చించి నిర్మించుకోవడం వలన
ప్రజలకు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరువ చేసినట్లయిందని మంత్రి
పేర్కొన్నారు.