నాని – కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘దసరా’ సినిమా, మార్చి 30వ తేదీన పాన్
ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలంగాణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తొలి రోజునే
సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండు వారాలను పూర్తిచేసుకుంది. 14
రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 24.98 కోట్లను వసూలు చేసింది.రెండు తెలుగు రాష్ట్రాలలో కలుపుకుని ఈ సినిమా 43.31 కోట్లను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 111.05 కోట్ల గ్రాస్ ను .. 61.82 కోట్ల షేర్ ను
రాబట్టింది. ఇంతవరకూ ఈ సినిమా 12.82 కోట్ల లాభాలను రాబట్టిందని అంటున్నారు.
నాని కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించినదిగా ఈ సినిమా నిలిచింది.

ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని .. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ మెప్పించారు.
మాస్ లుక్ లోను .. యాసలోను .. డాన్సులలోను పోటీలు పడ్డారు. చాలాకాలం తరువాత
కీర్తి సురేశ్ కి సరైన హిట్ పడిందని చెప్పుకోవాలి. తొలి ప్రయత్నంలోనే హిట్
కొట్టిన శ్రీకాంత్ ఓదెలకి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయనేది టాక్.