విజయవాడ : గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రదర్శనతో కూడిన మార్కెట్,
కొనుగోలు మద్దత్తు అందించి సహకరించిన నాబార్డ్ వారి సహాయం ఎంతో సంతృప్తి
కలిగించిందని ముఖ్య అతిధి, శిల్ప గురు జాతీయ అవార్డు గ్రహీత కె. గంగాధర్
తెలిపారు. పటమట పంట కాల్వ మేరీ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన నాబార్డ్
హ్యాండీ క్రాఫ్ట్ మేళా ప్రదర్శన, అమ్మకాలకు ముగింపు సమావేశంను ఉద్దేశించి
ముఖ్య అతిధి శిల్ప గురు గంగాధర్ మాట్లాడుతూ హస్తకళ, చేనేత వస్త్ర పరిశ్రమ,
నైపుణ్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నాబార్డ్ వంటి సంస్థల సహకారం
అద్భుతమని ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పోచంపల్లి, పొందూరు,
వెంకటగిరి, మంగళగిరి, మహేశ్వరీ, కలంకారీ, కొండపల్లి, ఏటికొప్పాక, తిరుపతి లలో
కొనసాగుతున్న చేనేత వస్త్రాల తయారీకి తోడు చెక్కబొమ్మలు, గాజు, లెదర్, జూట్
వంటి ముడిసరుకుతో స్టాళ్లలోనే పలు వస్తువులను తయారు చేయడంతో కొనుగోలుదారులు
సంతృప్తి వ్యక్తం చేయడం ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేకత కలిగి ఉన్నట్లు గంగాధర్
వివరించారు.నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ మహిళా సంస్థల
ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నాబార్డు సంస్థ సహకారంతో ప్రదర్శనతో
కూడిన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న చేనేత
కళాకారులు, మహిళా సంఘ సభ్యులు తమ ఉత్పత్తులు, వారి కళ పట్ల అత్యంత గర్వంగా
ఉండడంతో ఎంతో శ్రమతో కూడిన పనితనంతో అందమైన గాజు, లెదర్, చెక్క కళాఖండాలు
ప్రదర్శనలో ఉంచి సంతోషకరమైన అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఆప్కాబ్ మేనేజింగ్
డైరెక్టర్ ఆర్. ఎస్. రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న చేనేత కళల
సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా
కనిపించిందన్నారు. ఇతర దేశాలకు భిన్నంగా ఒకేచోట వందలాది మంది చేనేత హస్త
కళాకారులు కలిసి పనిచేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతున్నట్లు మా సంస్థ
గుర్తించిందని రెడ్డి వివరించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు,
ఉత్పత్తిదారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం కళాకారులు మరియు
ఉత్పత్తిదారుల వివరాలతో కూడిన కేటలాగ్ విడుదల చేయడంతో సభ ముగింపు జరిగింది.
ముగింపు సమావేశానికి కెవిఎస్. ప్రసాద్ (నాబార్డు డిజిఎమ్) ఎమ్.ఎస్. ఆర్.
చంద్రమూర్తి, మిలింద్ చౌసల్కర్, మేరాలాల్, మహంతి, హరీష్, స్థానిక బ్యాంకు
కాలనీ, టీచర్స్ కాలనీ, పోస్టల్ కాలనీ వాసులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు.