జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
అమరావతి : నాయీ బ్రాహ్మణుల సమస్యలను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర
కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. నాయీ
బ్రాహ్మణుల కుల వృత్తి లోకి రిలయన్స్ కార్పొరేట్ కంపెనీ రావడాన్ని
వ్యతిరేకిస్తూ నిరసన, రాస్తారోకోలు, పాదయాత్రలతో కార్పొరేట్ కంపెనీలకు
వ్యతిరేకంగా నిర్వహించారు. రిలయన్స్ తో పాటు ఇతర కార్పొరేట్ సెలూన్లను కూడా
రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. కులవృత్తి లోకి
కార్పొరేట్ సంస్థలు అడుగు పెడితే 10 లక్షల మంది రోడ్డున పడతారని, ప్రైవేటు
వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలు సెలూన్ షాపులు పెట్టకుండా నాయి బ్రాహ్మణులకు
మాత్రమే పెట్టుకోవడానికి ప్రత్యేక జీవో కావాలని విజ్ఞప్తి చేశారు. నాయి
బ్రాహ్మణులకు అర్హులైన వారికి డబు ల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, నాయి
బ్రాహ్మణులకు నాయి బ్రాహ్మణ బందు ప్రకటించాలని, దేవాలయాల్లో వాయిద్య
కళాకారులకు, తలనీలాలు చేసే నాయి బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ ను నియమించాలని కోరారు. నాయి బ్రాహ్మణుల పై
జరుగుతున్న దూషణలు దాడులకు ప్రత్యేక రక్షణ చట్ట కల్పిస్తూ ప్రత్యేక చట్టం
తేవాలని, నాయి బ్రాహ్మణులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, నాయి
బ్రాహ్మణులకు 10 లక్షల హెల్త్ కార్డులు కావాలని, నాయి బ్రాహ్మణులకు స్థలం
కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలన్నారు. దీనిపై సానుకూలంగా
స్పందించిన వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి
తీసుకుని వెళతామని, నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని
విధాలా తోడ్పాటును అందిస్తోందని తెలిపారు.