కోవూరు : కోవూరు నియోజకవర్గం, పాటూరు చేనేత కార్మికులు నారా లోకేష్ ను కలిసి
సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక చేనేతను
ఉపాధిరంగంగా చూడాలని, చేనేతలు నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం
లేదన్నారు. అన్ని ముడిసరుకులపై 42 శాతం జీఎస్టీని ఈ ప్రభుత్వం వసూలు
చేస్తోందని, చేనేతపై ఆధారపడిని 8 ఉపవృత్తుల వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ
పథకాలు అందడం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఆదునిక డిజైన్లు తయారు చేయడానికి
అవరసరమైన మిషనరీలు ఇవ్వడం లేదని, నెల్లూరు జిల్లాలో తయారు చేసిన వస్త్రాలను
చేనేత బజారు ఏర్పాటు చేయాలని, చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు
చేసుకునేందుకు వర్క్ షెడ్స్ ఏర్పాటు చేయాలని, చేనేతలకు సంబంధించిన 11 రకాల
రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 1979లో నెల్లూరు సిటీ గాంధీ నగర్ లో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాటన్, డైయింగ్ కోసం హీట్ ప్లాంట్ కు 7.10
ఎకరాల స్థలం కేటాయించారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్లాంట్ పనులు
నిలిచిపోయాయి. ఆ ఫైలు తిరుపతిలో ఆప్కో కార్యాలయంలో ఉంది. చేనేతలకు తమిళనాడు
తరహాలో రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత
కార్మికులకు ప్రభుత్వ హామీతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. నారా లోకేష్
మాట్లాడుతూ జగన్ అసమర్థ పాలనతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. గత
నాలుగేళ్లలో 60 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఒక్కరికి కూడా
పరిహారం అందించలేదు. టీడీపీ హయాంలో రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేశాం. టిడిపి
అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికల కోసం కామన్ వర్క్ షెడ్లు ఏర్పాటు చేస్తాం.
కేంద్రంతో మాట్లాడి జీఎస్టీ రద్దు చేయిస్తాం. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే
భరించేలా చేస్తాం. అధికారంలోకి రాగానే చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్
అందిస్తాం. గతంలో మాదిరిగా యార్న్, పట్టు సబ్సీడీలను అధికారంలోకి వచ్చాక
మళ్లీ అందిస్తాం. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను
కల్పిస్తాం. చేనేత పనివారలకు ఎటువంటి పూచీకత్తులేకుండా సబ్సిడీ రుణాలను
అందచేస్తామని హామీ ఇచ్చారు.