విజయవాడ : స్థానిక 34వ డివిజన్ కేదారేశ్వర పేట విఎంసి కళ్యాణ మండపంలో 34, 35,
56 డివిజన్ల లోని స్వయం సహాయక సంఘాల లోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా
పధకం క్రింద మూడవ విడత రుసుము విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా పాల్గొని 352 స్వయం
సహాయక సంఘాల లోని 3520 మంది అక్కా చెల్లెమ్మలకు 2 కోట్ల 37 లక్షల 65వేల నూట
డెభై రెండు రూపాయల విలువైన చెక్కును అందచేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్ర
పటానికి మహిళలతో కలిసి పాల అభిషేకం చేశారు. అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ
పాదయాత్రలో అక్క చెల్లెమ్మలు కష్టాలు తెలుసుకుని ఆసరా విడుదల చేస్తున్న
వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. 4 విడతల ద్వారా డ్వాక్రా రుణాలను మాఫీ
చేస్తున్నామన్నారు.
గతంలో చంద్రబాబు మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.పవన్
కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ వాళ్లు మహిళలను మోసం చేశారన్నారు. మహిళల గుండెలలో
జగన్ మోహన్ రెడ్డి వున్నారన్నారు.ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ
చేస్తున్నామన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని లక్ష్యంతో
50శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. మహిళలకు
పెద్ద పీట వేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. వచ్చే ఎన్నికలలో
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలను నమ్మద్దు అని పిలుపునిచ్చారు.
నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీటింగ్స్ కి రావాలనీ సవాలు విసిరారు.
మళ్ళీ జగన్ రావాలని మహిళలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్
లోకేష్ లు పనికిమాలిన వారన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా జగన్ కి జైజై లు
పలుకుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతాడన్నారు. పవన్ కళ్యాణ్
నీ వారాహి ఎక్కడ అని ప్రశ్నించారు. ఎవరికి అద్దెకి ఇచ్చావు ఎంత వస్తున్నాయి
అని అడిగారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు మహిళ ద్రోహులు అని అన్నారు.
రాష్ట్ర హక్కులు కోసం మాట్లాడని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు.ప్రత్యేక
హోదా కోసం ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నించారు. చంద్రబాబు నీ ముఖ్యమంత్రి చేయడం
కోసమే పని చేస్తున్న వ్యక్తి పవన్ అని అన్నారు. పొత్తు కోసం మాట్లాడుకోవడం
కోసం ఢిల్లీ వెళ్ళాడన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆయా
డివిజన్ల కార్పొరేటర్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి
పుణ్యశిల, బలసాని మణేమ్మ, యలకల చలపతిరావు, క్లస్టర్ ఇంచార్జ్లు, సచివాలయ
కన్వీనర్లు,గృహ సారథులు, తదితర పార్టీ నాయకులూ కార్యకర్తలు, నగర పాలక సంస్థ
అధికారులు, స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మలు పాల్గొన్నారు.