విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న
మణిపాల్ హాస్పిటల్ మరో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతీ ఏటా
నిర్వహించే మణిపాల్ గుడ్ హెల్త్ రన్ రెండో ఎడిషన్ ను ఆదివారం నిర్వహించింది.
5కి.మీ, 10కి.మీ అనే రెండు కేటగిరిల్లో చేపట్టింది. విజయవాడలోని పడవలరేపు
సెంటర్ నుంచి ఈ రన్ ను మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి
సమక్షంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా జెండా ఊపి ప్రారంభించారు. ఈ
రన్ లో సుమారు 4,000 వేలకు పైగా నగర ప్రజలు పాల్గొన్నారు. మణిపాల్ హాస్పిటల్
నిర్వహించిన ఈ రన్ లో విజయవాడలోని పౌరులు, విద్యార్థులు, ఫిట్నెస్ సెంటర్లు,
రన్నర్లు, స్పోర్ట్స్ క్లబ్లు, ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభించింది.
సగటు మానవుని బిజీ లైఫ్ లో వాకింగ్, రన్నింగ్ కు ఉన్న ప్రాముఖ్యతను
మరిచిపోయారు. కావున సమాజంలో వాటిపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ రన్
ను చేపట్టారు. ఎమర్జెన్సీ సమయాల్లో మనుషుల ప్రాణాలు ఎలా కాపాడాలనే దానిపై కూడా
ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ అత్యవసర సేవల సిబ్బంది మాక్ డ్రిల్
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన విజయవాడ సిటీ పోలీస్
కమిషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ “ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి
ఒక్కరూ కట్టుబడి ఉండాలి. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తున్న
ఈ గుడ్ హెల్త్ రన్ నిజంగా అభినందనీయం. రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి
అవగాహన కల్పిస్తున్న వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇలాంటి
కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి
హజరైన మరో అతిధి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు మాట్లాడుతూ
“అవయవదానానికి మరింత మంది ముందుకు రావాలి. అంతేగాకుండా ఇతరులను కూడా
చైతన్యపరచాలి. ఒక వ్యక్తి అవయవాలు ఎనిమిది మంది వ్యక్తులకు కొత్త జీవితాన్ని
ఇస్తాయి. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ వారు ఈ గుడ్ హెల్త్ రన్ ను
చేపట్టడం అభినందనీయం. ఇది మనకు శారీరకంగా, మానసికంగా ప్రయోజనాలను
అందిస్తుంది. ఈ సందర్భంగా అవయవ దానం కోసం క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి
స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నగర పౌరులను కోరుతున్నానని అన్నారు.
జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.కె.రాంబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ
అవయవదానానికి ముందుకు రావాలి. అవయవదానం చేయడం వల్ల దాత, గ్రహీత కుటుంబాలు
ఆనందంగా ఉంటాయి. అవయవ మార్పిడి అవసరం ఉన్నవారిని బంధువులు స్నేహితులు,
సహోద్యోగులు, పరిచయస్తులను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. మార్పిడి తర్వాత
వారు కొత్త జీవితాన్ని పొందుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మణిపాల్
హాస్పిటల్స్ విజయవాడలో అవయవాల దానంపై అవగాహన కల్పిస్తుంది. ఇది అభినందనీయమని
అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్
సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ మణిపాల్ హాస్పిటల్ నిర్వహిస్తున్న సెకండ్
ఎడిషన్ రన్ కు విజయవాడ పౌరుల నుంచి వస్తున్న ఆదరణ, ఉత్సాహానికి మా కృతజ్ఞతలు.
రన్నింగ్ చేయడం అనేది మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, రన్నింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి
ప్రజల్లో అవగాహన కల్పిండానికి కృషిచేస్తుంది. నివారణ వ్యూహాలను అనుసరించడంతో
పాటు మెరుగైన జీవనశైలితో అనేక వ్యాధులను తిప్పికొట్టవచ్చు. వాస్తవానికి,
ఎక్కువ కూరగాయలు, పండ్లు, ఫైబర్ ఉండేవి తినడం, శారీరక వ్యాయామం, ధూమపానానికి,
మద్యపానానికి దూరంగా ఉండడం, వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాల ద్వారా అనేక
వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని అన్నారు.