రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం కొండంత అండగా నిలుస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో నాలుగో విడత ఆసరా ద్వారా 3,518 పొదుపు సంఘాల ఖాతాలలో 32 కోట్ల 12 లక్షల 70 వేల 712 రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలందరూ ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడత ఆసరా ద్వారా నియోజకవర్గంలో 3,237 గ్రూపులకు గానూ 28 కోట్ల 40 లక్షల రూపాయలు విడుదల చేయగా.. రెండో విడత ద్వారా 3,518 పొదుపు సంఘాల ఖాతాలలో 32 కోట్ల 12 లక్షల 70 వేల 712 రూపాయలు., మూడో విడత ద్వారా 3,518 పొదుపు సంఘాల ఖాతాలలో 32 కోట్ల 12 లక్షల 70 వేల 712 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 55 స్వయం సహాయక సంఘాలకు పెండింగ్ లో ఉన్న రూ. కోటి 7 లక్షల 46 వేల 207 నగదును విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తంగా నాలుగు విడతలలో 35,388 మందికి 125 కోట్ల 85 లక్షల 58 వేల 343 రూపాయలు అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వివరించారు. రాష్ట్రంలోని ఆడపడుచులందరూ వారి కాళ్లపై నిలబడి వ్యాపారవేత్తలుగా రాణించేలా చేయూతనందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.