అమెరికా : అమెరికాకు చెందిన దిగ్గజ అంతరిక్ష సంస్థ నాసా తన డిజిటల్
ప్లాట్‌ఫామ్‌లను విస్తరిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ ప్రకటనలో
వెల్లడించింది.అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా (NASA) తన డిజిటల్
వేదికలను విస్తృతం చేస్తోంది. సరికొత్త వెబ్సైట్ బీటా వెర్షన్‌ను
అందుబాటులోకి తీసుకురావడం, అధికారిక మొబైల్ యాప్‌ను అప్డేట్ చేయడంతోపాటు..
నాసా+ ఆన్‌డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసులను జోడించడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ విషయాన్ని నాసా అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రతి ఒక్కరికి సరికొత్త
కంటెంట్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ పేర్కొంది. beta.nasa.gov/
అడ్రస్‌తో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘‘ప్రపంచ స్థాయి నాసా
వెబ్ ఎక్స్‌పీరియన్స్‌తో మానవాళిని ప్రేరేపించడమే మా లక్ష్యం. వీక్షకుల
అనుభూతిని మెరుగుపర్చేందుకు సాంకేతికత పరంగా మా వెబ్‌సైట్‌ను మరింత
మెరుగుపర్చాం’’ అని ఆ సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జెఫ్ సీటన్
పేర్కొన్నారు. సరికొత్త వెబ్సైట్లో టాపిక్ల ఆధారంగా కంటెంట్ అనుభూతిని
పొందవచ్చని నాసా వెల్లడించింది. భవిష్యత్తులో వెబ్‌సైట్‌ను మరింత
మెరుగుపరుస్తామని పేర్కొంది. ఈ ఏడాది చివర్లో నాస్+ పేరిట వాణిజ్య ప్రకటనలు
లేని, ఉచిత స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించనున్నట్లు పేర్కొంది. దీనిని
కుటుంబ సమేతంగా వీక్షించవచ్చని వెల్లడించింది. అన్ని ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై
నాసా+ అందుబాటులోకి రానుంది. దీనిని నాసా యాప్ నుంచి యాక్సెస్ చేయవచ్చు.