తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు తమిళ హీరో విశాల్. కథానాయిక
లక్ష్మీమీనన్ ను ఆయన పెళ్లాడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం
అయ్యాయి. వీటిపై విశాల్ మాట్లాడుతూ నా గురించి రాసే తప్పుడు వార్తలపై నేను
సాధారణంగా స్పందించను. కానీ ఒక అమ్మాయిని అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగడం వల్లే
స్పందించాల్సి వస్తున్నది. ఇలాంటి పుకార్ల ద్వారా ఓ అమ్మాయి వ్యక్తిగత
జీవితానికి, పరువు మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు. నా పెళ్లి వార్తల్లో
ఎలాంటి నిజం లేదు. నా పెళ్లి విషయం పెద్ద రహస్యం ఏమీ కాదు. సమయం వచ్చినప్పుడు
నా పెళ్లి గురించి నేనే అధికారికంగా ప్రకటిస్తాను’ అని విశాల్ పేర్కొన్నారు.
విశాల్, లక్ష్మీమీనన్ కలిసి తమిళంలో రెండు చిత్రాల్లో నటించారు. దాంతో వారిదరు
పెళ్ళి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.