గుంటూరు : ‘రాజకీయంగా మా మనుగడ అంటే వైసీపీతోనే అని ఎప్పుడూ చెబుతాం’ అని మాజీ
మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘సుచరిత ఆ
స్టేట్మెంట్ ఇచ్చిందంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారు.
అలాకాకుండా దయాసాగర్ పార్టీ మారతాను. నువ్వు నాతో రా అంటే నేను ఎంత రాజకీయ
నాయకురాలినైనా, ఒక భార్యగా నేను నా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా.’ అని ఆమె
వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ
దయాసాగర్ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరు.
అందువల్ల జగన్మోహన్రెడ్డి పార్టీతో మనగలిగినన్ని రోజులు ఉండాలని
అనుకుంటున్నాం. మేం వైకాపా కుటుంబ సభ్యులం. ఒకే ఇంట్లో ఉండే ఐదుగురిలో కూడా
విబేధాలు ఉంటాయి. అంత మాత్రాన వారు వేరని కాదని ఆమె పేర్కొన్నారు.