కెరీర్ ప్రారంభంలో ప్రతీది ఒక యుద్ధమే’ అంటోంది కథానాయిక శోభిత ధూళిపాళ, పలు
చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్
సెల్వన్-2’లోనూ మెరిసింది. ఆమె ప్రస్తుతం ‘ది నైట్ మేనేజర్’ పార్ట్ 2 కోసం
ముస్తాబవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూ లో తన కెరీర్ ప్రారంభ రోజుల్లో
కెమెరా ముందు ఉండేంత అందంగా లేవంటూ విమర్శలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ‘నేను
ఇంకా సినిమా రంగంలోకి రాలేదు. నాకు బాగా గుర్తుంది. నేను ఆడిషన్స్ ఇచ్చే
రోజుల్లో నేను అందంగా లేనని నా ముఖం మీదే చెప్పారు. చాలా బాధగా అనిపించింది.
అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా చిత్రపరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలనే
నా కల కోసం ముందుకు కొనసాగాను’ అని చెప్పుకొచ్చింది శోభిత.