హైదరాబాద్ : టర్కీలోని ఇస్తాంబుల్ శనివారం రాత్రి కన్నుమూసిన ఎనిమిదో నిజాం
నవాబు భర్కత్ అలీఖాన్ మకరం ఝా బహదూర్ పార్థీవ దేహాన్ని మంగళవారం
హైదరాబాద్‌కు తరలించారు. చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం నవాబు పార్థీవదేహాన్ని
ఉంచగా.. సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
డీజీపీ అంజనీకుమార్ సైతం ముకరం ఝాకు నివాళులర్పించారు. ఇదిలా ఉండగా చివరి
నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మనువడు. గత శనివారం రాత్రి ఇస్తాంబుల్‌లో కన్నుమూయగా
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో ఖననం చేసేందుకు ముమ్మర
ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాలెస్‌లో పార్థీవదేహాన్ని సందర్శనార్థం
ఉంచగా సందర్శనకు కుటుంబీకులు, బంధువులకు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటల
నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్థీవ దేహాన్ని చూసేందుకు అనుమతి ఉండగా
మధ్యాహ్నం 2 గంటలకు ముకర్రం ఝా అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.మక్కా మసీదుకు
చేరుకున్న తర్వాత నిజాం సమాధుల పక్కనే ముకర్రం ఝా పార్థీవ దేహాన్ని ఖననం
చేయనున్నారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్
మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించిన ముఖరం ఝా
జన్మించారు. 1971 వరకు అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా కొనసాగారు.