ఒకసారి సూపర్ సక్సెస్ ను అందుకున్న కాంబినేషన్ లో మరోసారి నటించే అవకాశం వస్తే
ఎవరు మాత్రం నో చెప్తారు. కానీ ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోతే
ఒప్పుకుని కూడా తప్పుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ రష్మిక మందన్న పరిస్థితి
ఇలాగే ఉందట. గతంలో నితిన్ కు జంటగా ‘భీష్మ’ చిత్రంలో నటించింది రష్మిక. ఆ
సినిమాను డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల మరోసారి ఇదే జంటతో ఓ సినిమా ప్లాన్
చేశాడు. మూడు నెలల క్రితం విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియోలో ఎంతో జోష్ గా
కనిపించింది రష్మిక. కానీ ఇప్పుడు డేట్స్ కుదరక ఆ సినిమా నుండి తప్పుకుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కు జంటగా ‘పుష్ప 2’లో నటిస్తున్న ఆమె, మరోవైపు
‘రెయిన్ బో’ అనే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. మరో
తెలుగు సినిమాతో పాటు రెండు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న ఆమెకు డేట్స్
అడ్జస్ట్ చేయడం సాధ్యపడటం లేదట. అందుకే నిర్మాతలతో మాట్లాడి నితిన్ సినిమా
నుండి ఆమె తప్పుకున్నట్టు సమాచారం.