అనుకుంటారు. అది కూడా మంచిది కాదు. అలాగని తక్కువ నిద్రపోతే అనర్దాలు కూడా
ఉన్నాయి. అసలు నిద్ర విషయంలో ఏం చేయాలనే సందిగ్ధత ఉందా.. అయితే బెర్లిన్
శాస్త్ర వేత్తలు ఏమంటున్నారో చూద్దాం…బెర్గెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బాగా ఎక్కువ నిద్రపోయేవారు, బాగా
తక్కువ నిద్రపోయే వ్యక్తులపై ఒక సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో కొన్ని
షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎక్కువ నిద్రపోవడం లేదా తక్కువ నిద్రపోవడం
ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా విధాలుగా హానికరమని ఈ పరిశోధకులు పేర్కొన్నారు.ఇక
బెర్గెన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇంగేబోర్గ్ ఫోర్థాన్ ఈ పరిశోధనకు
నాయకత్వం వహించడం జరిగింది.ఈసారి బాగా ఎక్కువగా నిద్రపోయే వ్యక్తులపై అధ్యయనం
చేసినట్టు డాక్టర్ ఫోర్థాన్ వెల్లడించారు. అప్పుడు వారు వివిధ వ్యాధులను
ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తించడం జరిగింది.ఇంకా బెర్గెన్ విశ్వవిద్యాలయంలోని
పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువ నిద్రపోయే వారు
యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. నిద్రకు ఆటంకాలు అనేవి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్
ప్రమాదాన్ని పెంచుతాయని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు
ఇప్పటికే ఉన్నాయని కూడా పరిశోధకులు తెలిపారు.
నిద్రా భంగం లేదా నిద్రలేమి అనేది ప్రతిచోటా ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ
సమస్యను చాలా సులభంగా గుర్తించవచ్చని కూడా ఆయన వివరించారు. ప్రజలు ఈ వ్యాధి
బారిన పడినట్లయితే, వారు కూడా యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా తీసుకోవాలని కూడా
స్పష్టం చేశారు. అయితే సరిగ్గా నిద్రపోయే వారికి జలుబు, ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చే
అవకాశాలు తక్కువని కూడా డాక్టర్ ఫోర్థాన్ స్పష్టం చేశారు.అలాగే యూనివర్సిటీ
ఆఫ్ బెర్గెన్లో జరిపిన పరిశోధన ప్రకారం, ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే
వ్యక్తులు ఖచ్చితంగా నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. తక్కువ నిద్రపోయే
వ్యక్తులకు మొత్తం 27 శాతం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది, అయితే 9 గంటల కంటే
ఎక్కువ నిద్రపోయే పౌరులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏకంగా 44 శాతం ఉందని
పరిశోధన పేర్కొంది. కాబట్టి అతిగా నిద్రపోవడం చాలా ప్రమాదకరం. అంతే కాకుండా
తక్కువ నిద్ర పోవడం కూడా అంతే ప్రమాదకరమని ఈ పరిశోధనలో పేర్కొన్నారు.ఒక సగటు
మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజుకు 7 – 8 గంటలకు తక్కువ, 9
గంటల కంటే ఎక్కువ అస్సలు నిద్ర పోకూడదు.