అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక సమస్యలతో పాటు గుండెపోటు అవకాశాలు
పెరుగుతాయి. అయితే కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గాఢ నిద్ర
కలుగుతుంది. అవేంటో చూద్దాం..
1. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా గల చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి
నిద్ర పడుతుంది. చేప నూనె తీసుకున్నా కూడా మంచిదే.
2. కొవ్వు పదార్థాలు
మంచి కొవ్వులు ఎక్కువగా ఉండే చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు కూడా మంచి నిద్రకు
కారణమవుతాయి. వీటిలోని ట్రిఫాఫ్యాన్ అనే అమైనో యాసిడ్ వల్ల బాగా నిద్ర
పడుతుంది.
3. డ్రై ఫ్రూట్స్
ఆక్రోట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా గింజల్లో నిద్రకు సహాయపడే
మెలటోనిన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిద్ర కోసం ఈ డ్రై
ఫ్రూట్స్ తినడం మంచిది.
4. ఆకుకూరలు
ఆకుకూరల్లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా
మారతాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల గుండె పనితీరు మెరుగుపడి గాఢనిద్ర వస్తుంది.
5. ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో కూడా మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వృద్ధుల్లో నిద్రలేమి
సమస్యను నివారిస్తుంది. అందువల్ల ఎండు ద్రాక్షను కూడా మీరు మీ డైట్లో భాగం
చేసుకోండి.
6. కివీ
కివీ పండ్లలో ఫోలేట్స్, పొటాషియంతో పాటు విటమిన్లు, ఇతర ఆవశ్యక ఖనిజాలు
ఉంటాయి. దీనివల్ల కివీ పండ్లు తినగానే మంచి నిద్ర పడుతుంది.
7. ఆలివ్ నూనె
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వంటల్లో ఆలివ్ నూనె ఉపయోగించడం మంచిది. ఆలివ్
నూనెలోని పోషకాల వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే మాంసం మాత్రం తగ్గించాలి.
8. ఫైబర్
ఫైబర్ ఎక్కువగా ఉండే పైనాపిల్, పప్పు ధాన్యాలు, కూరగాయలు తిన్నా కూడా మంచి
నిద్ర పడుతుంది. వీటిలోని ఫైబర్ తొందరగా జీర్ణమై మంచి నిద్రకు కారణమవుతుంది.