కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామపంచాయతీలో 38 లక్షలునిధులు దుర్వినియోగం
విజయవాడ : కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామపంచాయతీలో 38 లక్షల నిధులు
దుర్వినియోగ మయ్యాయనిసామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీలో 38 లక్షలు 72 వేల
847 రూపాయలు నిధుల దుర్వినియోగం అయినట్లు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్
గౌడ్ సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో సాధారణ నిధులు
రూ,6,64,247/ 18వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమైనట్లు మచిలీపట్నం డివిజనల్
పంచాయతీ అధికారి జ్యోతిర్మయి డిసెంబర్ 14 న ఒక నివేదికలో పేర్కొన్నారని, ఈ
విషయమై జిల్లా పంచాయతీ అధికారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణా జిల్లా కలెక్టర్ కు స్పందనలో విన్నవించడం
జరిగిందని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.