చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల “పరామర్శ యాత్ర” కార్యక్రమం
విజయవాడ : ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 9వ తేదీ నుండి చేపట్టిన ఉద్యమ కార్యాచరణ
లో భాగంగా ఇప్పటికే ఉద్యోగులందరూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21 నుండి వర్క్ టూ
రూల్ పాటిస్తూ విధులు నిర్వహిస్తుండగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు
కారుణ్య నియామకాలు పొందకుండా పెండింగ్ లో ఉన్న చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల
“పరామర్శ యాత్ర” కార్యక్రమం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఆయా జిల్లా నాయకత్వం
ఆధ్వర్యంలో వారి వారి కుటుంబాలను సందర్శించి, ఆ కుటుంబాల బాధ, ఆవేదనను ఇటు
ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసే విధంగా చేపట్టారు. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగులు సంబందించి కరోనాకి ముందు, కరోనా సమయంలో
చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సబ్యులకు కారుణ్య నియామాకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి
కరుణ చూపండి మహాప్రభో అంటూ వేడుకుంటున్న ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాద్యత
ప్రభుత్వపై ఉన్నా సరే ఇంతవరకు ప్రభుత్వం లేనిపోని నిబంధనలు అడ్డుపెట్టి,
ఆటంకాలు సృష్టిస్తూ కారుణ్యనియాకాలు జరపకుండా ప్రధానంగా టీచర్లు, పిటీడీ
(అర్టిసి) ఉద్యోగులు, మెడికల్ తదితర అనేక దీర్ఘకాలికంగా పెండింగు
పెడుతున్నారు. కొన్నిశాఖలలో ఏదో మొక్కుబడిగా కొన్ని ఉద్యోగాలు, కారుణ్య
నియామాకాలు ఇచ్చామని చేతులు దులుపుకుంటూన్నారే కానీ పూర్తి స్దాయిలో అన్ని
శాఖలలో కారుణ్య నియామకాలు, నిబంధనలను, రోస్టర్ పద్దతిని పక్కన పెట్టి వాళ్లకు
అవసరమైతే సూపర్ న్యుమరీ పోస్టులు క్రియేట్ చేసి, ఉద్యోగాలు ఇచ్చి కారుణ్య
నియామాకాల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని
ప్రభుత్వశాఖలలో (ప్రధానంగా విద్య, వైద్య, ఆర్టిసి తదితర శాఖలలో) ఉన్న అన్ని
డిపార్టుమెంట్లలో ఇంతవరకు పెండింగు ఉన్న అన్ని కారుణ్యనియామాకాలు జరిపి
ఆకుటుంబాలను మానవతాదృక్పధంతో ఆదుకోవాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు,స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు డిమాండ్
చేసారు. ఈ కార్యక్రమం ఎపి జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కనపర్తి
సంగీతరావు, ప్రధాన కార్యదర్శి కిరణ్ నాయకత్వంలో జరిగింది. జిల్లా నాయకత్వంతో
పాటు, ఏపీ హెడ్ మాస్టర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర
క్లాస్-4 ఎంప్లాయిస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్.మల్లేశ్వరరావు, విఆర్
ఓ అసోషియేషన్ రాష్ట్రకార్యదర్శి ఏ.సాంబశివరావు, తధితరులు పాల్గొన్నారు.