విజయవాడ : తెలుగు భాష కు నిలువుటద్దం…సంఘ గౌరవ అధ్యక్షులు మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సారధ్యంలో భారత పూర్వపు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభించిన ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు దాదాపు 1700 మంది దేశ, విదేశీ ప్రతినిధులు తో విజయవంతం గా జరిగాయి. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని తెలుగు పండిట్, మీడియా కమిటీ సభ్యులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ను నేడు సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ సత్కరించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ తెలుగు భాష విశ్వవ్యాప్తికి నిర్విరామంగా తనవంతు కృషి చేస్తానని అన్నారు.