ఘనంగా బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహావిష్కరణ
పోలాకి : నిస్వార్ధ రాజకీయాల్లో నిర్విరామ ప్రజాసేవలో నిరంతర స్ఫూర్తి దివంగత
బొడ్డేపల్లి రాజగోపాలరావు అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
పోలాకి మండలం సుసరాం గ్రామంలో గురువారం మాజీ పార్లమెంట్ సభ్యులు కీ.శే.
బొడ్డేపల్లి రాజగోపాల రావు విగ్రహావిష్కరణ, నరసన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ
చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిధిగా
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడ్డేపల్లి కుటుంబంతో తనకెంతో ఆత్మీయ
సంబంధాలున్నాయన్నారు. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తానూ,
బొడ్డేపల్లి సత్యవతి శాసనసభ్యులుగా కలసి పనిచేశామన్నారు. ఉత్తరాంధ్ర, అందులోనూ
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎన్నో చిరస్మరణీయ సేవలు
అందించారని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో రాజకీయాల్లో ఉత్తమ విలువలను
నెలకొల్పారని అన్నారు. తన చేతులమీదుగా అటువంటి గౌరవనీయుని విగ్రహం ఆవిష్కరణ
జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నరసన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా
ప్రమణస్వీకారం చేసిన భాస్కరరావు సుధీర్ఘకాలంగా ప్రజాసేవా రంగంలో ఉన్నారని
అన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన పోలాకి జెడ్పీటీసీ, వైస్సార్సీపీ జోనల్
ఇంఛార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ గత తరంలోని స్ఫూర్తిమంతమైన
నాయకుల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఎంతో గొప్పవారని అన్నారు. అటువంటివారి
ఆదర్శాలను అందిపుచ్చుకుని నవతరం ముందుకు కదలాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ
ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, కలింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్,
డా. కిల్లి కృపారాణి, టెక్కలి ఇన్చార్జి దువ్వాడ వాణి, డీసీసీబీ చైర్మన్
కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, కళింగ కోమటి
కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పొందర, కూరాకుల కార్పొరేషన్
చైర్మన్ రాజాపు హైమావతి, ఎంపీపీ లు ఆరంగి మురళీధర్, వాన గోపి, పార్టీ
సీనియర్ నాయకులు పొందరి కృష్ణారావు, ముద్దాడ భైరాగినాయుడు, బార్ల
వేణుగోపాల్, వరుదు వంశీకృష్ణ, గెల్లంకి వెంకటరమణ, సనపల సోమేశ్వరరావు, డా.
జీవితేశ్వరరావు, డా. ధానేటి శ్రీధర్, డా. బలగ మురళి, చింతు రామారావు, చింతాడ
రామ్మోహన్, డా. దుంపల హరి ప్రసాద్, దుంపల ఆనందరావు, కణితి సత్తిబాబు, కోరాడ
చంద్రభూషణ్ గుప్తా, పంగ బావాజీనాయుడు, బొబ్బాది ఈశ్వరరావు, ఏవీరమేష్,
అన్నెపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం, సత్కారం
నరస్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన దుంపల భాస్కరరావు
ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు దంత సింహాచలం(వైస్ చైర్మన్),
డైరెక్టర్లుగా వేలాల వెంకటరమణ అడ్ల చంద్రావతి, పాశిన సరోజిని, రావాడ
అప్పన్నరాజు, గేదెల వరలక్ష్మి, గొర్లె కుమారి, తోట ముద్దమ్మ, మేడి రూపావతి,
సతివాడ ఉమాదేవి, రాజాన సూరమ్మ, పంచిరెడ్డి సత్యన్నారాయణ, వారణాశి
సత్యన్నారాయణ, కోరాడ చిన నర్సింహమూర్తి తదితరులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన
వారిలో ఉన్నారు. వీరికి కృష్ణదాస్ నేతృత్వంలో నాయకులంతా ఘనంగా సన్మానం చేశారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఇలపండ సుందరరావు, కణితి తవుడుల మృతికి రెండు
నిమిషాలు మౌనం పాటించారు.