తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు సైతం
తెలంగాణకు చెందిన రఘురామిరెడ్డికి 15వ ర్యాంకు
టాప్-50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు విద్యార్థులు
న్యూఢిల్లీ : లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యూజీ
ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్‌కు హాజరైన 28,38,596 మందికి గానూ
11,45,976 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన బోర
వరుణ్ చక్రవర్తితో పాటు.. తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు ఆలిండియా ఫస్ట్
ర్యాంక్ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్ ర్యాంక్
దక్కింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు
పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహించిన
విషయం తెలిసిందే. జూన్ 4న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీనిపై జూన్ 6వరకు విద్యార్థుల నుంచి
అభ్యంతరాలను స్వీకరించింది.
నీట్ చక్రవర్తి..శ్రీకాకుళం కుర్రాడికి దేశంలోనే ప్రథమ ర్యాంక్
నీట్ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ప్రథమ
ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి జె.ప్రభంజన్‌తో కలిసి ఈ
ర్యాంకును పంచుకున్నాడు. నీట్ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర
వరుణ్ చక్రవర్తి ప్రథమ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి
జె.ప్రభంజన్‌తో కలిసి ఈ ర్యాంకును పంచుకున్నాడు. మంగళవారం రాత్రి నీట్ యూజీ
పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ మే 7న దేశవ్యాప్తంగా
499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,38,596 మంది
హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో 11,45,976 మంది (56.12%) అర్హత సాధించారు.
తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 72,842 మందిలో 42,654 (58.55%), ఏపీ నుంచి హాజరైన
68,578 మందిలో 42,836 (62.46%) మంది అర్హత సాధించారు. టాప్-50 ర్యాంకుల్లో
తెలుగు విద్యార్థులు ఏడుగురు ఉండగా, వారిలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్ వారే.
వీరిలో వరుణ్ చక్రవర్తి (1, ఆంధ్రప్రదేశ్), కాంచాని గేయంత్ రఘురాంరెడ్డి
(15, తెలంగాణ), యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్‌రెడ్డి (25, ఆంధ్రప్రదేశ్),
వంగీపురం హర్షిల్‌సాయి (38, ఆంధ్రప్రదేశ్), కణి యశశ్రీ (40, ఆంధ్రప్రదేశ్),
కల్వకుంట్ల ప్రణతిరెడ్డి (45, ఆంధ్రప్రదేశ్), జాగృతి బోడెద్దుల (49, తెలంగాణ)
ఉన్నారు.
తెలుగులో రాసింది 1295 మందే : మొత్తం 13 భాషల్లో నిర్వహించిన నీట్ యూజీ
పరీక్షను ఇంగ్లిష్‌లో అత్యధికంగా 16,72,914 మంది, హిందీలో 2,76,180 మంది
రాయగా, తెలుగులో 1,295 మందే రాశారు. హిందీ, ఇంగ్లిష్ తర్వాత గుజరాతీ
(53,027), బెంగాలీ (43,890), తమిళం (30,536)లో అత్యధికులు పరీక్ష రాశారు.