రఘువీరారెడ్డి.
50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నీలకంఠాపురం లో జరిగింది.
ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తాను
చదువుకునే రోజులు చేసే అల్లరి,వారితో కలిసి ఆడిన ఆటలు, చిన్నచిన్న
గ్యాంగులు,అవన్నీ ఓ మధురమైన క్షణాలు… మళ్లీ అవన్నీ గుర్తుకు చేసుకుంటూ…50
సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆనందంగా కలిశారు మాజి మంత్రి రఘువీరారెడ్డి
చిన్ననాటి స్నేహితులు. 1971 -73 మడకశిర ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మొదటి
సంవత్సరం ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం నీలకంఠాపురం ZPHS స్కూల్
ఆవరణంలో కలుసుకొని తమ పాతజ్ఞాపకాలను నెమరువేసుకొన్నారు. అనంతరం ఇటీవలే మాజీ
మంత్రి రఘువీరా రెడ్డి “ఒక ఇటుక విరాళం కోటి పుణ్యం ఫలం” అనే నినాదంతో
నిర్మించిన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. స్వామివారి ఆశీర్వాదం తీర్థ
ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పథిలం
చేసుకున్నారు. ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా
పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు.చదువుకున్న రోజుల్లో పాత జ్ఞాపకాలు
నెమరు వేసుకొంటు ఆనాటి జ్ఞాపకాలు, చిలిపి చేష్టలు, గుర్తుకు తెచ్చుకొని అత్యంత
ఉల్లాసంగా సంతోషంగా గడిపారు.