హైదరాబాద్ : సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ
రూపొందించిన నూతన క్రీడా విధానం ముసాయిదా పై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి
డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో సమీక్షా
సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్
గౌడ్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా ముసాయిదాకు తుది రూపం ఇచ్చి, వచ్చే క్యాబినెట్
సమావేశం నాటికీ ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒలంపిక్ తో
పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వివిధ దేశాల యొక్క క్రీడా విధానాన్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసి అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మెరుగైన
అంశాలను క్రోడీకరించి, క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయాలని ఆదేశించారు.
క్రీడల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఎటువంటి
సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందో అధ్యయనం చేసి స్పోర్ట్స్ పాలసీలో జోడించాలని
మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అదేశించారు. ఈ సమీక్ష లో తెలంగాణ నూతన
రాష్ట్ర క్రీడా విధానము జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగా నిష్ణాతుల
మెప్పు పొందేలా మన రాష్ట్ర క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా
ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమన్నారు. అందుకు తగిన విధంగా తుది
కసరత్తు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు ఈ పాలసీ తయారీలో క్రీడ
రంగా మేధావులు, అసోసియేన్ ప్రతినిధులు, ఒలంపియన్లు, అంతర్జాతీయ క్రీడాకారులు,
ఎంతోమందితో సంప్రదించి వారి సలహాలను సూచనలు అన్నిటిని సమీకరించి ఒక మంచి
ముసాయిదా ను తయారు చేశారని ఇంకా ఇందులో జోడించాల్సిన అంశాలపై వెంటనే దృష్టి
సారించి దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రక్రీడారంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని
మంచి పాలసీని తీసుకొచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి డాక్టర్
వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, క్రీడా సామాగ్రి వివరాలను క్రీడా
పాలసీ నందు పొందుపరిచి సంబంధిత గ్రామీణ క్రీడా ప్రాంగణాలను, తెలంగాణ రాష్ట్ర
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉండే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను
కోరారు. తెలంగాణ క్రీడా పాలిసీ నందు గ్రామీణ క్రీడాకారులకు, యువతకు ప్రాధాన్యత
కల్పిస్తూ నిర్వహిస్తున్న సి.ఎం. కప్ టోర్నమెంట్ వివరాలను అన్ని జిల్లాల యందు
విడతల వారీగా క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయు విదంగా పాలసీ లో పొందుపరచాలని
తెలిపారు. జిల్లా స్థాయి నందు క్రీడా అకాడమీలు, హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి
క్రీడా విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్ ప్రాంగణాలను,
ప్రభుత్వం, ప్రవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్వహించేవిదంగా ప్రణాళికలు తయారు
చేయాలనీ క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా పాలసీ నందు విద్యా,
పంచాయత్ రాజ్ శాఖ సహకారంతో గ్రామీణ స్థాయి నుంచి క్రీడా అభివృద్ధి జరుగుటకు
సంబంధిత పి ఈ టీ లను భాగస్వామ్యం చేయు విదంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పోర్ట్స్ కోటా ను సంబంధిత అన్ని
ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రవేశముల యందు ప్రభుత్వ , అన్ని సంస్థల ఉద్యోగాలలో అమలు
చేయు విదంగా అందుకు సాట్స్ నుండి ఒక అధికారిని ప్రతేక్యంగా నియమించే విదంగా
చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. తెలంగాణ
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్ని
స్టేడియాలు అత్యున్నత స్థాయి నిర్వహణకు సీ ఎస్ ఆర్, ఆర్ ఆర్ ఆర్ నిధులను
ఉపయోగించుకునే విదంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర
క్రీడా ప్రాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ సంఘం, క్రీడా సంఘాలు, విశ్వ
విద్యాలయాలు, విద్యా శాఖా సమన్వయంతో స్పోర్ట్స్ క్యాలెండరు ను విడుదల చేయాలని
ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుండి అనుమతి తీసుకొని
ప్రవేట్ సెక్టార్ లో జిమ్ లు, స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేసుకోవాలి.
ప్రైవేట్ సెక్టార్ లో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం
ల్యాండ్ కేటాయిస్తుందనీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కోచ్
లను మూడు కేటగిరీలలో నియామకానికి తగిన నియమాలను పొందుపరచాలని ఆదేశించారు.
ప్రతి సంవత్సరం జిల్ల స్థాయిలో 15 రోజులు క్రీడలను నిర్వహించేవిదంగా
ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ లో ప్రస్తుతం ఉన్న
కాంట్రాక్టు కోచ్ లను రెగ్యూలరైజ్ చేయాలనీ మరియు జిల్లాలలో వివిధ స్టేడియాలలో
పనిచేయడానికి కోచ్ లను నియమించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో యువజన అభివృద్ధి పర్యాటక సాంస్కృతిక, క్రీడా
శాఖ కార్యదర్శి విసి & ఎం.డి. సాట్స్ శైలజ రామయ్యర్, క్రీడా శాఖ చైర్మన్ డా.
ఆంజనేయ గౌడ్, క్రీడా శాఖ డైరెక్టర్ డా. కె. లక్ష్మి, రాష్ట్ర ఒలంపిక్ సంఘం
అధ్యక్షడు డా. వేణు గోపాలా చారి , కార్యదర్శి జగదీష్ యాదవ్, ఉపాధ్యక్షులు
ప్రేమ్ రాజ్, సాట్స్ అధికారులు సుజాత , అనురాధ, చంద్రా రెడ్డి, ధనలక్ష్మి
తదితరులు పాల్గొన్నారు.