గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన ఎస్.అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చిత్తశుద్ధి, నిజాయితీ గల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పదవిలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.