విజయవాడ : నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా
భేటీ అయ్యారు. శుక్రవారం ఏపీ గవర్నర్‌గా అబ్ధుల్ నజీర్ ప్రమాణస్వీకారం
చేయనున్నారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకచకా
ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్
అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్,
ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం
విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్
రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.