విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం హోం మంత్రి కార్యాలయం
నందు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, వారి
తనయులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సామినేని వెంకట
కృష్ణ ప్రసాద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట
నియోజకవర్గం లోని చిల్లకల్లు గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా చిల్లకల్లు
పోలీస్ స్టేషన్ కొంతమేర పోనున్న నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయం సమీపంలో
ప్రభుత్వ స్థలంలో నూతన పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రికి
వివరించారు. ఈ మేరకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.