ఇందులో ఉన్న విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి పోషణను అందిస్తాయి.
* సమస్యలు దూరం:
చర్మాన్ని సంరక్షించడంలో నెయ్యి సహాయపడుతుంది. బయిట నుంచి చర్మాన్ని అందంగా
మార్చడమే కాకుండా, చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
* ముడతలు మాయం:
నెయ్యిలో విటమిన్ ఏ, ఈ, డీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం
ఎలాస్టిసిటిని కాపాడతాయి. ఈ కారణంతో ముడతల సమస్య రాదు. దీంతో నిత్యయవ్వనంగా
కనిపించవచ్చు.
* హైడ్రేట్:
నెయ్యిను రాసుకోవడం లేదా, నెయ్యిను ఆహారంలో భాగం చేసుకోవడంతో చర్మం తేమగా
మారుతుంది. స్నానానికి ముందు నెయ్యితో శరీరాన్ని మసాజ్ చేయడంతో చర్మం
పొడిబారదు.
* మెరిసే చర్మం:
సరైన పరిమాణంలో రెగ్యులర్గా నెయ్యి ను తీసుకోవడంతో చర్మం మెరుస్తుంది. చర్మంపై
మచ్చలు తొలగి ప్రకాశవంతంగా మారుతుంది.
* మృదువైన చర్మం:
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం కారణంగా చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలకు నెయ్యి
చెక్ చెబుతుంది. నెయ్యి రాసుకోవడంతో చర్మం మృదువుగా మారుతుంది. అలెర్జీలు దూరం
అవుతాయి.
* మెరిసే పెదాలు:
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పెదాలను మెరిసేలా చేస్తాయి.
నెయ్యితో మసాజ్ చేయడంతో పెదాలపై ఉన్న డార్క్ పిగ్మెంట్లు తగ్గుతాయి. నెయ్యి
రాసుకోవడంతో పింక్ పెదాలు పొందవచ్చు.
* డార్క్ సర్కిల్స్:
ఒత్తిడి, కాలుష్యం కారణంగా చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది
పడుతున్నారు. డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రాంతంలో నెయ్యి రాసుకోవడంతో డార్క్
సర్కిల్స్ తొలగుతాయి.
* టాక్సిన్ల తొలగింపు:
చర్మంలో పేరుకుపోయిన టాక్సిన్ లను తొలగించడంలో నెయ్యి సహాయపడుతుంది.
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు కదలికకు సహాయపడుతుంది. దీంతో వ్యర్థాలు
బయిటకుపోయి చర్మం మెరుస్తుంది.