అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల
కోటాలో 9, ఎమ్మెల్యేల కోటాలో 7, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలతో
కలుపుకొని మొత్తం 18 స్థానాలను త్వరలో భర్తీ చేయనున్నారు. ఇందులో పూర్తి
మెజారిటీ అధికార వైయస్ఆర్సీపీకే ఉంది కాబట్టి మొత్తం స్థానాలు ఆ పార్టీ
అభ్యర్థులే కైవసం చేసుకోనున్నారు. ఇందులో నెల్లూరు నుంచి వైయస్సార్సీపీ జాతీయ
అధికార ప్రతినిథి కె.రవిచంద్రారెడ్డి స్థానిక సంస్థల కోటాలో గానీ లేదా గవర్నర్
కోటాలో గానీ లేదా ఏ కోటాలోనైనా పూర్తిగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత రెండు మూడు రోజుల నుంచి సోషియల్ మీడియాలో ఇదే అంశంపై వార్తలు ప్రచారం
అవుతున్నప్పుడు వాటికి రియాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కామెంట్ల రూపంలో జగన్ మోహన్
రెడ్డిని ఆ నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలతో ముంచెత్తుతున్నారు. జగన్ మోహన్
రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా
గూడూరు నియోజకవర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి దివంగత
వైయస్ రాజశేఖర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి వీరాభిమాని. ఆయన మరణానంతరం వైయస్
జగన్ కి, పార్టీకి వీర విధేయునిగా ఉంటూ రాష్ట్ర స్థాయిలోగానీ, జాతీయ స్థాయిలో
గానీ మీడియాలోనూ, బయటా వైయస్సార్సీపీ పార్టీ తరఫున చాలా బలంగా గళం విప్పుతూ
వస్తున్నారు. అలాంటి వ్యక్తి శాసన మండలిలో కూడా ఉంటే ప్రభుత్వం తరఫున గట్టిగా
గళం విప్పగలరని, అలాగే పార్టీకి కూడా మరింత బలం చేకూరుతుందని సీఎం వైయస్ జగన్
భావించి ఆయన పేరును కూడా పరిశీలనలో ఉంచినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ ట్రేడ్
ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆయనను
నెల్లూరు నుంచి రెడ్డి సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేసినట్లు
సమాచారం. గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన వాకాటి నారాయణరెడ్డి నెల్లూరు
నుంచి ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. గత నలభై ఏళ్లుగా గూడూరు నియోజకవర్గం
ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అక్కడ బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డి
కమ్యూనిటీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అందుకే ఇసారి గూడూరు నుంచి రెడ్డి
సామాజిక సమీకరణాల్లో భాగంగా కె.రవిచంద్రారెడ్డి పేరు చాలా బలంగా
వినిపిస్తోంది. ఎలాగూ గూడూరుకి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు
కాబట్టి ఇసారి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ఆ
నియోజకవర్గంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసినట్లవుతుందని సీఎం జగన్ మోహన్
రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.