అన్నపూర్ణగా కళకళలాడుతున్న ఆంధ్రప్రదేశ్
కృష్ణా , పశ్చిమ డెల్టాలకు సాగు, తాగునీటి విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖా
మంత్రి అంబటి రాంబాబు
విజయవాడ : ఖరీఫ్ సీజన్ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల
శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు
ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పూలు, పండ్లు,
గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల
చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా
ఖరీఫ్ సీజన్ కి కృష్ణా, పశ్చిమ డెల్టాలకు తాగు, సాగు నీటిని కాలువలకు
నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు విడుదల చేశారు. బుధవారం కృష్ణమ్మకు
ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పూలు, పండ్లు,
గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల
చేశారు. డిమాండ్ ను బట్టి మరింత నీటిని పెంచే అవకాశం ఉందని అధికారులు
పేర్కొన్నారు.
సీఎం జగన్ ప్రభుత్వంలో నీటి కొరత లేదు : ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు
మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు.
గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని,
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల ముండే నీరు విడుదల
చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే
అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది. ఉండదని.
పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు
అందిస్తున్నాని చెప్పారు. ‘పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదు. వైఎస్
జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి నీరు
తెచ్చే అవసరం ఉండదు. దివంగత వైఎస్సార్, సీఎం జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు
పడతాయని నిరూపణ అయ్యింది. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే. ముందస్తుగా
చర్యలు తీసుకుంటాం. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల కోసం రిటైనింగ్
వాల్ నిర్మాణం చేశారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి
సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు
మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా
కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.