విజయవాడ : విజయవాడలో ఏప్రిల్ 27 నుండి మే 3 తేదీ వరకు జరగనున్న సహస్ర చండీ
యాగంకి హాజరు కావాలని మంగళవారం నిర్వాహకులు నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్ కి
ఆహ్వానం పలికారు. సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జీ పక్కన ఉన్న శ్రీ దేవి కరుమారి
అమ్మన్ శక్తి పీఠంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో సహస్ర
చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక మహోత్సవము జరుగుతున్న దరిమిలా ఈ యాగానికి
రావాల్సిందిగా భవానిపురం లోని ఊర్మిళ నగర్ లోని గాంధీ ఆశ్రమానికి వచ్చిన
పీఠాధిపతి నేటి గాంధీ ఆర్ ఆర్ నాగరాజన్ కి కరపత్రాలు అందించారు. అలాగే నేటి
గాంధీకి శాలువా, అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి
కరుమారి దాసుతో పాటుగా బంగారు భారతి,పీఠం ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్,
నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, నవ్యాంధ్ర రచయితల
సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని వెంకట రమణ, నవ మల్లెతీగ సాహిత్యం మాస
పత్రిక సీనియర్ సబ్ ఎడిటర్ సీహెచ్ రాఘవేంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.