ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్
విజయవాడ : నేటి తరం జర్నలిస్టుల కు సీనియర్ జర్నలిస్టు,రచయిత,
యేమినేని వెంకట రమణ ఆదర్శమని ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ అన్నారు. సోమవారం విజయవాడలో రమణయ్య కూల్ డ్రిక్స్ సెంటర్లో సీనియర్ జర్నలిస్టు, రచయిత, ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకట రమణ కు ఏ. పి.ఎం.ఏ. నగర అధ్యక్షులు తాళ్ళూరి అనిల్ కుమార్ అధ్యక్షతన ఘన సత్కారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,
తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్టు, స్వచ్ఛంద సేవా ట్రస్ట్ సౌజన్యంతో మాచవరం సేవా ఫౌండేషన్ / తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్టు
శ్రీకృష్ణ దేవరాయలు, యోగి వేమన జయంతి ఉత్సవాలు (2024 )లో భాగంగా
జాతీయ పురస్కారాల ప్రధానోత్సవాల్లో కార్యక్రమం
చిట్టినగర్ లోని
పుల్లేటికుర్తి ప్రసాద్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపములో నిర్వహించి యేమినేని వెంకట రమణ ను సామాజిక సేవా సామ్రాట్
పురస్కారం తో ఘనంగా సత్కరించారు. ఈ అవార్డు అందుకొన్న యేమినేని ని ఏ పి ఎమ్ పి ఏ రాష్ట్ర, నగర, కార్యవర్గ సభ్యులు ఆయన ఆత్మీయులు అభినందించారు. శాలువలతో సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ..వెంకట రమణ అటు జర్నలిస్టుగా,ఇటు రచయిత గా సమాజానికి ఎంతో సేవలు అందించారని అందుకే ఆయన నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శమని ఆయన అన్నారు. కాగా అవార్డు గ్రహీత యేమినేని వెంకట రమణ మాట్లాడుతూ ఈ అవార్డు తనదే కాదని మన జర్నలిస్టుల అందరిదీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎం.పి.ఏ. రాష్ట్ర నాయకులు పసుపులేటి చైతన్య, ప్రధాన కార్యదర్శి, అంతరాత్మ దినపత్రిక సంపాదకులు గుర్రం శ్రీనివాసరావు,కోటా రాజా, జిర్రా కోటేశ్వరరావు, నాగోతి శ్రీనివాసరావు, (ఎన్ ఎస్ ఆర్),ఫనేంద్ర కుమార్, కోటేశ్వరరావు, సునీల్ శ్రీనివాసరావు జ్వాలజ్యోతి రాజ్ కుమార్ రాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.