నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల
మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 31వ
తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని టీటీడీ తెలిపింది. పుష్కరిణిలో ఉన్న
నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో
భాగంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని టీటీడీ
తెలిపింది. ఈ నెల రోజులపాటు పుష్కరిణికి హారతి ఉండదని అధికారులు చెప్పారు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదని, పుష్కరిణిలోని
నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ
అందుబాటులో ఉందన్నారు. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి
తిరిగి వినియోగిస్తామని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని
తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తామని వెల్లడించారు.
మరమ్మతులు పూర్తి చేసి చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా
సిద్ధం చేయనున్నామని పేర్కొన్నారు.
రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు : కాగా, తిరుమలలో ఈసారి
బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు
నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల
బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా
నిర్వహిస్తామని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న
ధ్వజారోహణం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు
చేయనున్నట్టు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్ దర్శనం
కల్పిస్తున్నట్టు చెప్పారు.