◻️ విద్యార్థులు 6,64,152
◻️ పరీక్ష కేంద్రాలు 3,349
◻️ 104 సెంటర్లలో సీసీ కెమెరాలు
◻️ 9.30 గంటలలోపే చేరుకోవాలి
◻️ నిమిషం దాటినా అనుమతించరు
అమరావతి : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 15వ
తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. 17, 18 తేదీల్లో
ఓపెన్ స్కూల్ సొసైటీ, ఒకేషనల్ విద్యార్థుల పరీక్షలుంటాయి. 6,09,070 మంది
రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వారిలో బాలురు 3,11,329
మంది, బాలికలు 2,97,741 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు
53,140 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1,525 మంది ఉన్నారు. వీరి కోసం
3,349 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. గతేడాది వరకూ ఏడు
పేపర్ల విధానం అమల్లో ఉండగా, ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరుగుతున్నాయి.
◻️ సైన్స్‌లో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌కు ఈసారి ఒకే పరీక్ష
నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పీఎస్, ఎన్ఎ్సకు కేటాయించిన వాటిలో
మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష
కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఈసారి విద్యార్థులతో పాటు సెంటర్
సూపరింటెండెంట్ సహా టీచర్లెవరూ సెల్ఫోన్లు తీసుకురాకుండా నిర్ణయం
తీసుకున్నారు. అలాగే ప్రశ్నపత్రాలు లీకైతే ఎక్కడినుంచి బయటికొచ్చాయో కనిపెట్టే
విధానాన్ని అమలుచేస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు
జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే
పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
🔴 విద్యార్థులకు సూచనలు :
ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి
ఉండదు.
◻️ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, కెమేరాలు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్
వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు తీసుకెళ్లకూడదు.
◻️ అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12.45 గంటల లోపు విద్యార్థులను
బయటకు పంపరు.
◻️ వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, ఇతర స్టేషనరీని సెంటర్లోకి
తీసుకెళ్లవచ్చు