అతి పురాతన మరియు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా
426 వ ఉరుసు మహోత్సవాలు నేటి తో ప్రారంభం కానున్నాయి. ఉరుసు మహోత్సవానికి
దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంగళవారం గుసుల్ తో ప్రారంభమైన దర్గా ఉరుసు మహోత్సవాలు గురువారం చిరాగాతో
ముగుస్తాయి. ఫిబ్రవరి 1న బుధవారం జరిగే ఉరుసు మహోత్సవం అత్యంత ప్రత్యేకమైనది.
రైల్వే స్టేషన్ వద్ద గల తాజ్ హోటల్ షేక్ ఫరీద్
ఇంటి నుండి గంధం మేడ తాళాలతో భారి గుర్రాల తో ఊరేగింపుగా బయలుదేరి తెల్లారి
జామున దర్గాకు చేరుతుంది.
ఉరుసు ఉత్సవాలకు ఏర్పాట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.దర్గా
ప్రాంగణం మొత్తం, మెయిన్ రోడ్డు వరకు ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు,
ఉరుసు కు వచ్చే లక్షలాది భక్తుల కోసం మూడు రోజులపాటు షాఋఖారి నిత్య అన్నదాన
లంగర్ ఖానా ద్వారా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా షాబుఖారి ఆస్థాన పీఠాధిపతులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ దర్గాకు
వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉరుసు మహోత్సవానికి దేశ నలుమూల నుండి భక్తులు వస్తారని, రాష్ట్రంలోని రాజకీయ
నాయకులతో పాటు వివిధ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.
మతసామ్రాస్యానికి నిదర్శనమైనటువంటి షాబుఖారి దర్గాకు కులమతాలకు అతీతంగా
భక్తులు వీరి వీరిగా పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందాలని తెలిపారు.