వేదికను పర్యవేక్షించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తలశిల
రఘురామ్
విజయవాడ : అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియెట్,
డిగ్రీ స్థాయి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘జగనన్న
ఆణిముత్యాలు’ పేరున విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సన్మానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక
మార్కులు సాధించిన విద్యార్థులకు, వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు
మంగళవారం ‘జగనన్న ఆణిముత్యాలు’ పురస్కారాలను ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్
రెడ్డి అందజేయనున్నారు. మంగళవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్ లో ఈ
కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక ఏర్పాట్లను
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త
, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్
ప్రకాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు పర్యవేక్షించారు.