హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ సర్కార్ కీలక
నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే రేపు రాష్ట్ర మంత్రివర్గ
విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. అమాత్యుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, రంగారెడ్డి
కీలక గులాబీ నేత పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం
మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణం
చేయనున్నారు. రెండోసారి సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. రెండోసారి విస్తరణ
చేపడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా గురువారం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ
ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్నుబర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ
కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ అంశాలు దృష్టిలో
పెట్టుకొని దీనిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తాండూరులో
ప్రస్తుత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని
సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ విస్తరణ
చేపట్టనున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం
వెళ్లినట్లు తెలిసింది.