హైదరాబాద్ : అకాల వర్షాల, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఇవాళ ముఖ్యమంత్రి
కేసీఆర్ పరిశీలించనున్నారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో
పర్యటించనున్న సీఎం.. నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రకృతి
వైపరీత్యాలకు జరిగిన పంటనష్టంపై ఆయా ప్రాంతాల్లో అధికారులతో కేసీఆర్ సమీక్ష
జరపనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు.ఉగాది పండుగకు 4 రోజుల ముందు రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వర్షాలు, వడగండ్ల
వానలు… రైతులను నిండా ముంచేశాయి. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్
జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. జరిగిన నష్టంపై ప్రభుత్వం
ఇప్పటికే సర్వే చేపట్టగా.. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి
కేసీఆర్ ఇవాళ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక
హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం
బోనకల్ మండలంలోని రామాపూరానికి చేరుకుంటారు. అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న
మొక్కజొన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో కేసీఆర్ మాట్లాడుతారు.