డక్కిలి ( వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ )ఫిబ్రవరి :10 రాష్ట్రంలోని బీసీ హక్కుల సాధనకై ఆదివారం హలో బిసి చలో తాడేపల్లిగూడెం లో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి నియోజకవర్గ బిసి నాయకులు గెరిటి నారాయణ యాదవ్ ఒక ప్రకటన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని, వారికి అధికారంలో వాటా, ఆర్థిక భరోసా ఇవ్వడం లేదన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీ కులాలుకు చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవడంబాధాకరమన్నారు, రాబోవు ఎన్నికలలో పాలక వైకాపా పార్టీ, తెలుగుదేశం పార్టీలు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం బహిరంగ సభ ప్రధాన ఉద్దేశం డిమాండ్స్, జననగణంలో సమగ్ర కుల గణన, మహిళ రిజర్వేషన్ల బిల్లులో బిసి మహిళలకు సబ్ కోట, బీసీ సబ్ ప్లాన్, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లు, బీసీలకు క్రిమిలేయర్, బీసీల అట్రాసిటీ చట్టం తదితర డిమాండ్స్ ఉన్నాయి. కావున నియోజకవర్గం, జిల్లాలో బీసీలు సోదరులు తాడేపల్లిగూడెం బీసీ సభకు తరలిరావాలని నారాయణ కోరారు.