హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాబినెట్ ను ఈ
నెల 24న విస్తరించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి వర్గ విస్తరణలో రంగారెడ్డి
ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి మరో మారు స్థానం దక్కనుంది.
మంత్రిగా మహేందర్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావ తొలి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా 2 జూన్ 2014న ఆయన
సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి ప్రమాణస్వీకారం చేసి 8 జూన్ 2014న
బాధ్యతలను చేపట్టారు. అనంతరం 2018 వరకు మంత్రి గా ఆయన కొనసాగారు. గత
సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాల అనంతరం మహేందర్ రెడ్డి కి అప్పటి
టిఆర్ఎస్ పార్టీ అధినేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా
అవకాశం ఇచ్చింది. ఎంఎల్సీగా ఉండి కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం
నరేందర్ రెడ్డి స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా
పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో
05.02.22 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుండి రంగారెడ్డి జిల్లాతో పాటు
తాండూర్ రాజకీయాల్లో ఆయన చురుకుగా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగల
సత్తా ఉన్న మహేందర్ రెడ్డికి అధినేత మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు.
ఇలా మహేందర్ రెడ్డి రెండో సారి 24 న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం
చేయనున్నారు. 1994- 98, 1998 – 2004, 2009 – 2014, 2014 – 20018 వరకు తాండూరు
ఎంఎల్ఏ గా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. జూన్ 2019లో మొదటిసారి ఆయన
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి
ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా 5.2.2022 న
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.