అచ్చొచ్చిన పిచ్‌పై సెంచరీ చేస్తాడా..?
అందరి దృష్టీ కొహ్లీపైనే…
సమిష్టి ప్రదర్శనతో ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న
టీమ్ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా ఒడిసి పట్టేందుకు రెడీ అయింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఫుల్ జోష్‌లో ఉన్న
భారత్.. ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ ఆడనుంది. కానీ..
శనివారం కురిసిన వర్షం కారణంగా స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.
భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు
ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మరోవైపు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్
అసోసియేషన్ తెలిపింది. ఏది ఏమైనా మ్యాచ్ జరగాలని క్రికెట్ అభిమానులు
కోరుకుంటున్నారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఫుల్
జోష్‌లో ఉన్న భారత్.. ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్
ఆడనుంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్
రోహిత్ శర్మ తిరిగి బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా వన్డే
ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను రిహార్సల్‌గా భావిస్తున్న
ఆస్ట్రేలియా.. వాంఖడే మ్యాచ్‌లో మంచి ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు
చేజార్చి పరాజయం వైపు నిలిచింది. గత మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యఛేదనలో టాపార్డర్
విఫలమైనా.. హార్దిక్, జడేజాతో కలిసి రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. సుదీర్ఘ
ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేక జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. తనపై
వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. రోహిత్ రాకతో ఇషాన్‌కు
ఉద్వాసన తప్పకపోవచ్చు. గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. గత మ్యాచ్‌లో పెద్దగా
ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ.. తెలుగు ప్రేక్షకుల సమక్షంలో భారీ ఇన్నింగ్స్
ఆడుతాడా చూడాలి. తనకు అచ్చొచ్చిన మైదానంలో కోహ్లీ శతక్కొట్టాలని అభిమానులు
ఆకాంక్షిస్తున్నారు. తొలి వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్
యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఎలాంటి ఇబ్బందీ ఉండదు..
విశాఖలోని క్రికెట్ స్టేడియంను పూర్తి కవర్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం
పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి
ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
అయితే రోజంతా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా
ఉన్నాయి. ఒక వేళ మ్యాచ్ జరిగి.. ఇండియా గెలిస్తే.. సిరీస్‌ను కైవసం
చేసుకుంటుంది. లేదంటే మూడో మ్యాచ్‌లోనే ఫలితం తేలుతుంది. అక్కడ ఇండియా
గెలిస్తే సిరీస్ వస్తుంది. ఆస్ట్రేలియా గెలిస్తే.. మ్యాచ్ సమం అవుతుంది.