గుంటూరు : తెలుగుజాతి గుండెచప్పుడు, అన్న నందమూరి తారకరామారావు 27వవర్థంతి
కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ
నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 18వతేదీ ఉదయం 11గంటలకు మంగళగిరిలోని
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత
చంద్రబాబునాయుడు పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం కార్యాలయ ఆవరణలో
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ ముఖ్యనేతలు హాజరవుతారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్టీఆర్ వర్థంతి
కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన మెగా రక్తదాన
శిబిరాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో పెద్దఎత్తున అన్నదానం
నిర్వహించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తెలుగుదేశం పార్టీ
శ్రేణులంతా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా టిడిపి
అధిష్టానం పిలుపునిస్తోంది.