అమరావతి : వైద్యాన్ని ప్రతి పేదవాడికీ చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 108 వాహనాల
వ్యవస్థను బలోపేతం చేస్తూ ఆరోగ్య సేవలను విస్తరించారు. 2019లో కేవలం 531
అంబులెన్సులు ఉంటే వైయస్ జగన్ సీఎం అయ్యాక 2020లో అధునాతన సౌకర్యాలతో
కొత్తగా 412 అంబులెన్స్‌లు ప్రారంభించారు. ఇందుకోసం రూ.96.50 కోట్లు
వెచ్చించారు. అలాగే 2022 అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం
ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.4.76 కోట్లు
వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ఎక్కువ కాలం
ప్రయాణించి మూలన పడే స్థితిలో ఉన్న అంబులెన్సుల స్థానంలో 146 కొత్త
అంబులెన్సులను 2023లో జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.34.79
కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా ఏడాదికి 108 సేవల కోసం వెచ్చిస్తున్న వ్యయం
అక్షరాలా రూ.188.56 కోట్లు.ఆపదలో ఉన్న ఏ ఒక్క ప్రాణం పోకూడదన్న తపన,
తాపత్రయంతో రాష్ట్రంలో 108 వాహనాల వ్యవస్థను బలోపేతం చేశారు సీఎం వైయస్
జగన్.క్యాంపు కార్యాలయంలో సోమవారం 146 కొత్త అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి
జగన్ ప్రారంభించనున్నారు.