తోకముడిచిన అసమ్మతి
ఎవరైనా గ్రూపుల ఏర్పాటు కు యత్నిస్తే ఖబడ్ధార్ అంటూ అధిష్టానం వార్నింగ్
తల్లి తండ్రుల తరువాత ఒక బాధ్యతగా, వారసుడుగా వెంకటగిరిని అక్కున చేర్చుకున్న
నేదురుమల్లి రామ్ కుమార్
వేంకటగిరి: వేంకటగిరి లో ఎంతోకాలంగా గ్రూపుల మధ్య నలిగిపోయిన వైసిపి కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నేదురుమల్లి రాంకుమార్ ను సమన్వయకర్త గా నియమించడం తో ఊరట లభించింది. హమ్మయ్యా .. ఎట్టకేలకు పార్టీ మంచి నిర్ణయమే తీసుకుందన్న భావనను నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఇరకాట పరిస్థితుల నుంచి బయట పడినట్లుగా భావిస్తున్నారు. వేంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి కుటుంబానికి తల్లీ బిడ్డ లాంటి సంబంధం వుంది. ఎక్కడో మూలకు విసిరేసినట్లున్న వెంకటగిరిని నలభై సంవత్సరాలక్రితం
నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు (పెద్దాయన) సందర్శించి తీవ్ర వేదనకు గురయ్యారు. వెంటనే తన స్వంత డబ్బులు ఖర్చుపెట్టుకుని , ఆనాటి ప్రభుత్వాల పై వత్తిడి తెచ్చి నియోజక వర్గానికి అభివృద్ధి నడకను నేర్పించారు . తాగునీటికి
అడిగిన చోటల్లా బోర్లు వేయించారు.
మారుమూల అటవీ ప్రాంతాలకు లింక్ రోడ్లు వేశారు. వ్యసాయానికి కాలువలు తవ్వించారు. విద్యావ్యవస్థలు మొదలుకుని, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని , పోలీస్ బెటాలియన్ ఇలా అడుగడుక్కీ అభివృద్ధిని నింపి వేంకటగిరి కి పెద్దాయన అయ్యారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ అదేస్థాయి లో అభివృద్ధి
పనులు చేపట్టారు. పెద్దాయన సహకారం తో , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తోపాటు అనేక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజల చేత జేజేలు అందుకున్నారు. వారి తరువాత వారి వారసుడు గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వేంకటగిరి నియోజక వర్గ ప్రజలను అన్నీ రంగాల్లో అభివృద్ధి పథాన నడిపించాల్సిన భాద్యత తో రాజకీయాల్లోకి వచ్చారు. వేంకటగిరి కోసం పనిచెయ్యడం అనేది నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కి ప్రజాప్రతినిధి వంటి హోదాలు అవసరం లేని బాధ్యత తల్లీ తండ్రుల కాలం నుంచి ఆయనకు వుంది. అందుకే తండ్రి ఉండగానే 2014 లో కాంగ్రెస్
నుంచి పోటీ చేశారు . గెలుపు ఓటములతో పని లేకుండా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ తరపున ఓడిపోతామని తెలిసినా నిలబడ్డారు.
ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలిగిన సత్తా ఒక్క వైసిపి కి మాత్రమే ఉందని జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ఆ పార్టీ లో చేరారు. పార్టీ లో చేరిన అతి తక్కువ కాలం లో నే అధిష్టానం దృష్టిలో చురుకైన కార్యకర్తగా, విశ్వాసం వున్న నాయకుడిగా, అంకిత భావం తో పనిచేసే లీడర్ గా పేరు తెచ్చుకుని అయన ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ గా క్యాబినెట్ రాంక్ తో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఒకసంవత్సరం కాలం లో ఆయన పని తీరుకు మెచ్చి పార్టీ నాయకత్వం రామ్ కుమార్ కి తిరుపతి జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని
అప్పగించింది. అంటే ఏడు నియోజకవర్గాలను ( తిరుపతి, సత్యవేడు, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, వేంకటగిరి, శ్రీకాళహస్తి) ఆయనచేతిలో పెట్టి వాటిని గెలిపించుకురావాలని ఆదేశించింది. అయితే ఇదే సమయం లో సెల్ఫ్ గోల్స్ వేస్తూ పార్టీ క్యాడర్ ని, పార్టీ ని జనం లో చులకన చేస్తున్న వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని పక్కన పెట్టింది. జిల్లా అధ్యక్షుడిగా వున్న రామ్ కుమార్ కి అదనంగా వేంకటగిరి కూడా అప్పగించింది. అయితే ఇది ప్రత్యేక బాధ్యతలు కాకపోయినా అధ్యక్షుడిగా తన భాద్యతగాను, పైగా తన స్వంత నియోజకవర్గం కావడం, తన తల్లి తండ్రుల కాలం నుంచి వేంకటగిరి లో బలమైన అభిమానులు, ఒక్క పిలుపుతో వచ్చి పనిచేసే వాళ్ళు చుట్టూ ఉండటం తో ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం వేంకటగిరి నియోజక వర్గం లోని వైసిపి క్యాడర్ ని , నాయకత్వాన్ని ఒక తాటి పై నడిపించడం నేదురుమల్లి రామ్
కుమార్ కి నల్లేరు మీద నడకనే చెప్పవచ్చు. అయితే తల్లి తండ్రుల ను మించి ఏమేరకు
ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవలందిస్తారో వేచి చూడాలి.
రామ్ కుమార్ కి వేంకటగిరి ఇంచార్జి పదవితో అడుగుపెట్టిన వెంటనే ఎమ్మెల్యే ఆనం సైలెంట్ అయ్యారు. ఆయన వద్ద వున్న వైసిపి కార్యకర్తలు, నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ శిబిరం లో చేరిపోయారు. అలాగే చాలాకాలం గా పార్టీ లో ఒక గ్రూప్ కి నాయకత్వం వహిస్తున్న కలిమెల రామ్ ప్రసాద్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమంటున్నారు. ఒకదశలో ఆయన ఆత్మీయ సభపెట్టి పార్టీ అగ్రనాయకత్వానికి తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేసినప్పటికీ సజ్జల రామ కృష్ణారెడ్డి ప్రత్యక్షంగా రంగం లోకి దిగి గట్టిగా మందలించి నట్లు తెలిసింది. ప్రస్తుతం వెంకటగిరిలో లో వైసిపి ఒకే ఒక వర్గంగా అత్యంత శక్తి వంతంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ లో వణుకు మొదలైంది.