డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి:13 డక్కిలి మండల వైకాపా నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ సమావేశం నిర్వహించడమైంది. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు నేదురుమల్లికి బాణాసంచి కాల్చి ఘన స్వాగతం గజమాలతో ఆయనను సత్కరించారు. నేదురు మల్లి మాట్లాడుతూ తనపై చూపుతున్న అభిమానం తన తండ్రి స్వర్గీయ జనార్దన్ రెడ్డి, మా తల్లి రాజ్యలక్ష్మి లు నాకు ఇచ్చిన కానుక నేను భావించుతున్నానన్నారు, ఈ సమావేశంలో పెద్దవారు, నాయకులను తన తండ్రి తల్లి మీతో ఉన్న పరిచయం నుండి మిమ్ములను అందరిని దగ్గరుండి చూసాను అన్నారు, నాలో గర్వం, ఎవరిపై వివక్షత లేదని తన దగ్గరకు, తనను కలిసే అవకాశం ప్రతి ఒక నాయకులకు కార్యకర్తలకు ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రకటించారని మీ ఆశీర్వాదం, మీ ఓటుతో నేను గెలుస్తానన్న నమ్మకం నాకు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓటు బ్యాంక్ గా ఎప్పుడు చూడరని అందుకే తను ఎప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు నా పేద ప్రజలు అని సంబోధిస్తారని, మీకు మేలు జరిగిఉంటే వైకాపాకు అధికారం ఇవ్వమనే ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రస్తుత శాసనసభ్యులు తనకు అన్నీ అవకాశాలు ఇచ్చి, ప్రజలకు సేవ చేయమంటే వాటిని దుర్వినియోగం చేయడమే గాక, పార్టీకి నష్టం చేయడం, తప్పుడు ప్రచారం చేయడం గమనిస్తున్నారన్నారు. ఆయన ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతారని,ఏ పార్టీ కూడా సీటు ఇచ్చే అవకాశం ఉందో లేదో కూడా ఆయనకే తెలియని పరిస్థితి ఉందంటే ప్రజలే ఆలోచించేయాలన్నారు. మనమంతా ఒక కుటుంబమని చిన్న చిన్న లోపాలను సైతం సరిదిద్దుకున్నట్లే కొందరు అసంతృప్తులను సైతం త్వరలోనే మనతో కలిసి పని చేస్తారని ఎవరిలో ఎలాంటి అపోహలు వద్దన్నారు, సమావేశం అనంతరం ప్రతి పంచాయతీ వారిగా నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశ నిర్వహించి వారి సమస్యలను, వారి అభిప్రాయాలను, రాబోవు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలను వారితో మాట్లాడినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెలకం శంకర్ రెడ్డి, వైకాపామండల ప్రెసిడెంట్, ఎంపీపీ, జే సి ఎస్ ఇంచార్జి, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు,ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.