అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే
చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ
చిగురించి, పెళ్లి వరకు దారితీసింది. ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట
వివాహబంధంలో అడుగుపెట్టారు. ఇక ఈ జంటను చూసి మురిసిపోని అభిమానులు లేరు అంటే
అతిశయోక్తి కాదు. మరి.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ, నాలుగేళ్లు కూడా కలిసి
ఉండకుండానే ఈ జంట విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. చై- సామ్
మధ్య అసలు వివాదం ఏంటి..? విబేధాలు ఎందుకు వచ్చాయి..? అనేది ఇప్పటివరకు
మిస్టరీగానే ఉంది. అయితే కొంతమంది సామ్.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో చేయడం
వలనే విబేధాలు వచ్చాయని, ఇంకొంతమంది సామ్ బిహేవియర్ చై కు నచ్చక విబేధాలు
వచ్చాయని పలు రకాల పుకార్లు సృష్టించారు. ఇన్ని పుకార్లలో ఏ ఒక్కటి నిజం కాదని
ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ పుకార్లు పక్కన పెడితే విడాకుల తరువాత సామ్..
తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. విడాకులు అయిన కొద్దీ రోజులకే.. పుష్ప
సినిమాలో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే
ఇప్పటివరకు ఈ సాంగ్ గురించి కానీ, చై తో విడాకుల గురించి కానీ ఆమె
ప్రత్యేక్షంగా మాట్లాడింది లేదు. తాజాగా శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన
వ్యక్తగత విషయాలను పంచుకుంది.“పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్.. నేను చైతన్యతో విడిపోయిన
కొన్నిరోజులకే వచ్చింది. నేను ఓకే చెప్పగానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది
చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు .. ఈ సమయంలో ఇంట్లో కూర్చో..
ఇలాంటివి చేయకు.. విడాకుల తర్వాత వెంటనే నువ్వు ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు
అని సలహాలు ఇచ్చారు. నన్నెప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ కూడా ఈ సాంగ్
చేయొద్దని చెప్పుకొచ్చారు. అందరిని కాదని ఆ సాంగ్ చేయడానికి నాకు ఒక కారణం
ఉంది. నేను నా వైవాహిక జీవితంలో 100 పర్సెంట్ నిజాయితీగా ఉన్నాను. కానీ అది
వర్క్ అవుట్ అవ్వలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు
దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధపడాలి?.
అందుకే ఈ సాంగ్ చేశా. ఎన్నో బాధలను అనుభవించాను. నటిగా పర్ఫెక్షన్ గా
ఉండాలనుకున్నాను. కానీ, ఈ మయోసైటిస్ బారిన పడ్డాను. కళ్ళు సరిగ్గా కనిపించవు.
కళ్లద్దాలు పెట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారేమోనని భయం. మెడికేషన్ వలన చాలా
బాధను అనుభవించాను. కళ్లతోనే కోటి భావాలు పలికించాలి. కానీ నాకు ఈ పరిస్థితి
వచ్చింది.ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వేరొక నటికి రాకూడదని” సామ్ ఎమోషనల్
అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.