బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మరోసారి తనదైన శైలిలో
సీఎం కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశమంతా మద్యం పారించాలని
బీఆర్ఎస్, ఆప్ ప్రయత్నిస్తున్నాయని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశమంతా కొత్త
మద్యం పాలసీని తేవడానికి కృషి చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరికి వారే
చెప్పుకుంటే అది జాతీయ పార్టీ కాదని లక్ష్మణ్ చురకలు అంటించారు.