గుంటూరు : నొయిడాలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రచురణ కేంద్రాన్ని పాఠశాల
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం సందర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యాకానుక పథకంలో
భాగంగా ఆరు నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ‘ఆక్స్ ఫర్డ్’ డిక్షనరీ
అందజేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరానికి బడులు తెరిచేనాటికి
విద్యార్థుల చేతిలో సంపూర్ణ కిట్ ఉండాలన్న లక్ష్యంతో సన్నాహ ప్రణాళికలు
సాగుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు 80శాతం వరకు ముద్రణ పూర్తయి సిద్ధంగా
ఉన్నాయని, 15 రోజుల్లో జిల్లాలకు చేరనున్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొని, ముద్రించిన
డిక్షనరీలను పరిశీలించారు. అనంతరం నొయిడాలోనే పి.పి.బఫ్నా వెంచర్స్ ప్రైవేటు
లిమిటెడ్ నోటు పుస్తకాల ముద్రణ కేంద్రాన్ని కూడా సందర్శించారు. సంబంధిత
యాజమాన్యంతో మాట్లాడి ముద్రణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో
సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.